సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ బ్రేక్ వేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏపీ విషయాలను జోడించి కనకమేడల అసందర్భంగా మాట్లాడారు. కనకమేడల ప్రసంగంపై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కనకమేడల ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ ఛైర్మన్ తెలిపారు.
కాగా, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం విఫలమైందని చూపేందుకు గతంలో కూడా ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే.
2019 నుంచి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్‌ను రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని చెప్పారు.
చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
Comments
Please login to add a commentAdd a comment