
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల సొంతింటి నిర్మాణానికి పూజ చేసిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడంపై పలువురు రాజకీయ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: ఆ..వేదనే అంతు చూసిందా? )
ధర్మేగౌడ మృతి దురదృష్టకమరమని, ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందంటూ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మండలిలో ధర్మేగౌడకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యమంపై దాడి అన్నారు. చట్టసభల హుందాతనం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మృతి కేసును ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు.