వైఎస్ జగన్ను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి | Congress mlc kanteti satyanarayana raju meets ys jagan mohan reddy | Sakshi

వైఎస్ జగన్ను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి

Sep 3 2014 12:07 PM | Updated on Mar 28 2019 5:27 PM

వైఎస్ జగన్ను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి - Sakshi

వైఎస్ జగన్ను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు కలిశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు కలిశారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రేసులో ఉన్న కంతేటి .... వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ చైతన్య రాజు బరిలో ఉన్నారు. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ తన అభ్యర్థి ఖరారుపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement