ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ‍్యానించారు.