న్యూఢిల్లీ: బుధవారం లోకసభ్‌లో విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోదీ.. గురువారం కూడా రాజ్యసభలో మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పాపాలను శిక్ష అనుభవిస్తోందని విమర్శించారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. బీజేపీ తన పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందిందని చెప్పుకొచ్చారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తలు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.
గరీబీ హఠావో అనేది కాంగ్రెస్ నినాదం మాత్రమేనని ఆచరణకు నోచుకోలేదని మోదీ ఫైర్ అయ్యారు. వారు సమస్యలకు పైపూత మాత్రమే పూశార,ని తాము దీర్ఘకాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. విపక్షాలు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ లబ్ధి కోసం ఆలోచించనని, తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తున్నామని మోదీ అన్నారు. తాము వికాసాన్ని నమ్ముతాం, విపక్షాన్ని కాదని పేర్కొన్నారు. విపక్షాలను చూస్తుంటే జాలేస్తోందన్నారు.
ప్రభుత్వాల కూల్చివేతలపై..
ప్రభుత్వాల కూల్చివేతలపై కాంగ్రెస్‌కు మోదీ కౌంటర్ ఇచ్చారు. ఇంధిరా గాంధీ 50 సార్లకుపైగా ఆర్టికల్ 356తో ప్రభుత్వాలను పడగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఏంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారని విమర్శలు గుప్పించారు.
మరోవైపు మోదీ ప్రసంగానికి ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీంతో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
చదవండి: మోదీ ప్రసంగంపై రాహుల్ విమర్శలు.. అదానీ ఊసే లేదని సెటైర్లు..
Comments
Please login to add a commentAdd a comment