ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ప్రైవేట్ బిల్లుపై చర్చ జరగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రైవేట్ బిల్లు పెట్టాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్కు సభ్యులు డిమాండ్ చేయటంతో రగడ చోటుచేసుకుంది. ప్రత్యేక హోదాపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్కు కాంగ్రెస్ పట్టుబట్టింది.