
సాక్షి, న్యూఢిల్లీ: టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రెట్రాస్పెక్టివ్ ట్సాక్ తొలగింపు మంచి పరిణామం. వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగి పోతుంది.. తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. విదేశీ కంపెనీల విశ్వాసం పెరగడంతో పాటు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సులభతరం అవుతుంది. ఈ బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అన్నారు విజయసాయిరెడ్డి.