taxation laws
-
ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!
ఇదే ప్రశ్నని పూర్తిగా అడుగుతున్నాం. మీకు రెండు పర్మనెంట్ అకౌంట్ నంబర్లు ఉన్నాయా? అదేనండి.. రెండు పాన్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్ శాశ్వతం. ప్రత్యేకం. మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్మెంట్ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీ కట్టాల్సిందే.. ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. సరెండర్ చేయండి.. మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఎక్కడా ఆ నంబరును ప్రస్తావించకండి. తెలియజేయకండి. డిక్లేర్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదు. అంతటితో ఆగిపోకుండా వెంటనే ఆ నంబరును సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయాలి.. సరెండర్ అంటే కార్డుని ఫిజికల్గా డిపార్ట్మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్లైన్లోనూ చేయవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్లోడ్ చేయండి. కొత్త పాన్ కోసం, మార్పుల కోసం దీన్ని వాడవచ్చు. కారణం అడగరు. వివరణ అక్కర్లేదు. విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు. దరఖాస్తు చాలు. వెంటనే సరెండర్ చేయండి. పెనాల్టీ వేసే ముందు.. నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి. ఎగవేతకు ఇదే నాంది కాగలదు. కాబట్టి, అలా చేయకండి. వాడిన సందర్భంలో ఎగవేత లేదని రుజువు చేయలేకపోతే పెనాల్టీ పడుతుంది. బండి అంతదాకా పోనివ్వకండి. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
టాక్సేషన్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రెట్రాస్పెక్టివ్ ట్సాక్ తొలగింపు మంచి పరిణామం. వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగి పోతుంది.. తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. విదేశీ కంపెనీల విశ్వాసం పెరగడంతో పాటు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సులభతరం అవుతుంది. ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అన్నారు విజయసాయిరెడ్డి. -
కార్పొరేట్ పన్ను కోతకు బిల్లు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019ని లోక్సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్ పన్ను తగ్గింపునకు ఉద్దేశించిన ఈ బిల్లును అంతక్రితం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టారు. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతం ఇవ్వడానికి కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ, సెప్టెంబర్ 20వ తేదీన కేంద్రం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్, 2019ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఐఎఫ్ఎస్సీ అథారిటీ దిశలో... కాగా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ) అధారిటీ బిల్లు, 2019ని కూడా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఐఎఫ్ఎస్సీలకు సంబంధించి ఏకీకృత ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఏర్పాటు ఈ బిల్లు లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏర్పాటయ్యే అథారిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. చైర్మన్ నేతృత్వంలో పనిచేసే అథారిటీలో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఇద్దరు ప్రభుత్వ నామినీలు ఉంటారు. సెలెక్ట్ కమిటీ సిఫారసులతో మరో ఇరువురినీ ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అన్ని ఫైనాన్షియల్ సేవల ఏకీకృత నియంత్రణ ప్రతిపాదిత అథారిటీ ఏర్పాటు లక్ష్యం. ఐఎఫ్ఎస్సీల్లో ప్రస్తుతం బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, బీమా రంగాలు ఉంటే, వాటని ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ వంటి విభిన్న రెగ్యులేటర్లు నియంత్రిస్తున్నాయి. సెంట్రల్ జీఎస్టీ @ రూ.3.26 లక్షల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లని వివరించారు. -
ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు లోపల, బయట నెలకొన్న పరిస్థితులపై సమీక్షించేందుకు గురువారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగదు రద్దు తర్వాత డిపాజిట్లపై పన్నుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగదు రహిత లావాదేవీల్లో సత్వర చర్యలపై మంత్రివర్గం దృష్టి సారించింది.