► పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది.
► ఓబీసీ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. 127 రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఇస్తూ చట్ట సవరణ చేసింది.
► కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
► ఓబీసీ రాజ్యంగ సవరణ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్ చేపడుతోంది.
► రాజ్యసభలో ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైస్సార్‌సీపీ పార్టీ తరఫున మాట్లాడిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లును ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
► విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా 17 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు కొనసాగాయి. ఇప్పటికే లోక్‌సభలో కీలక బిల్లులు ఆమోదం పొందాయి.
► విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
► రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో గందరగోళ పరిస్థితులపై కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభలో సభ్యుల ప్రవర్తన కలచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారని వాపోయారు.
►లోక్‌సభలో పోలవరంపై వైఎస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరంపై నోటీస్ ఇచ్చిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. పోలవరం సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయాలని నోటీస్ ఇచ్చారు.
►లోక్‌సభలో మంగళవారం ఆమోందం పొందిన ఓబీసీ రాజ్యంగ సవరణ బిల్లు నేడు(బుధవారం) రాజ్యసభ ముందుకు రానుంది. జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ బుధవారం కొలువుదీరాయి. వరుసగా 17వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment