► రాజ్యసభలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పెగాసస్ వ్యవహారంపై విపక్ష సభ్యుల నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది.
► రాజ్యసభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా
►లోక్‌సభలో ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ
►ఓబీసీ బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్‌సీపీ
►పార్టీ తరఫున లోక్‌సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు.
►పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా
►రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
► పెగసస్‌పై చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారం కొలువుదీరాయి. వరుసగా 16వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవ్వగా.. నేడు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగిన ఓబీసీ సవరణ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబమమని కేంద్ర ప్రభుత్వ ం పేర్కొంది. అయితే ఓబీసీ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని 15 విపక్ష పార్టీల నిర్ణయం తీసుకున్నాయి.
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ మద్దతు ప్రకటించింది. పార్టీ తరఫున లోక్‌సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైఎస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. రాజ్యసభకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. అయితే ఆ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు పాస్ కావడం అనివార్యమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment