► మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు.
పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పెగాసస్, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ మధ్యాహ్నం 3.30 గంటలకు.. రాజ్యసభ మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా పడింది.
► పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పెగాసస్, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
► విపక్షాల ఆందోళలనతో పార్లమెంట్ ఉభయ సభలు మరోసారి మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి.
► మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి.
► విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి.
► లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
►పోలవరంపై లోక్‌సభలో వైఎస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం
►పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైఎస్ఆర్‌సీపీ నోటీసు
►లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ వంగా గీత
► లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి.
► రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల ఉభయ సభ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారి,మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అస్సాం-మిజోరాం సరిహద్దు ఘర్షణపై చర్చకు లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉభయసభల్లో పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగనుంది.
అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని నోటీసు ఇచ్చింది. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత ఇచ్చారు. మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ అంశంపై విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment