
ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదని..
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్‌సీపీ ఎంపీ గుర్తు చేశారు.