టీడీపీ పోతే పోయేదేముంది.. | Akali Dal throws weight behind NDA Govt | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 16 2018 4:38 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Akali Dal throws weight behind NDA Govt - Sakshi

హర్‌సిమ్రత్‌ కౌర్‌

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ భాగస్వామ్య పక్షం అకాలీదళ్‌ మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంలో కొనసాగలేమని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో అకాలీదళ్‌ స్పందించింది. టీడీపీ ఎన్‌డీఏను వీడినా తాము ప్రభుత్వం వెన్నంటి ఉంటామని స్పష్టం చేసింది.

ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించి మళ్లీ తామే తీర్మానం పెడతామని యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నాం. ఇలాంటి రాజకీయ సంక్షోభాల్ని, ఇబ్బందులను ఎన్నింటినో కలిసి ఎదుర్కొన్నామ’ని అకాలీదళ్‌ నాయకురాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement