
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పావని, డిప్యూటీ మేయర్-1 సత్తిబాబుపై కౌన్సిలల్ మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించి కలెక్టర్ హరికిరణ్‌కు 33 మంది కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇటీవలే మేయర్ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకోగా.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తీరుతో టీడీపీ పట్ల ఆపార్టీ కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment