
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సీ-బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా గో బ్యాక్, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, డిగ్గీ రాజా గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా నేతలు మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామన్నారు. విభజనకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తుండదని హెచ్చరించారు.