రాజకీయ సంక్షోభం: పాక్‌ క్యాబినేట్‌ అత్యవసర సమావేశం | Pakistan: Emergency Cabinet Meeting No Trust Vote Orders Imran Khan | Sakshi
Sakshi News home page

రాజకీయ సంక్షోభం: పాక్‌ క్యాబినేట్‌ అత్యవసర సమావేశం

Published Sat, Apr 9 2022 8:01 PM | Last Updated on Sat, Apr 9 2022 9:17 PM

Pakistan: Emergency Cabinet Meeting No Trust Vote Orders Imran Khan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతేగాక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గద్దె దింపేందుకు ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించారు కూడా. అయితే ఇమ్రాన్‌ కూడా ఈ విషయంలో పట్టు వదలడం లేదు. తాజాగా శనివారం ఈ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది.

జాతీయ అసెంబ్లీలో ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు స్పీకర్‌ అంగీకరించలేదు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. తాను చేసిన పనికి సుప్రీంకోర్టు ఏ శిక్ష విధించినా సిద్ధమని స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి 9.30 గంటలకు పాక్‌ క్యాబినేట్‌ అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీకి మంత్రులంతా హాజరుకావాలని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement