హైదరాబాద్ : శాసనసభలో గురువారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రెండు నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే ఇరుప్రాంతాల సభ్యులంతా పోడియం చుట్టుముట్టారు. తెలంగాణ, జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది.
విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించటంతో...చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ నల్లదుస్తులు ధరించి... క్యాలీఫ్లవర్లు పట్టుకొని సభకు హాజరయ్యారు.