చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా | andhra pradesh assembly adjourned for 10 Minutes | Sakshi
Sakshi News home page

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

Published Thu, Aug 28 2014 9:34 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా - Sakshi

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

హైదరాబాద్ : శాసన సభ గురువారం ప్రారంభంతోనే పది నిమిషాలుపాటు వాయిదా పడింది.  డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట తప్పుతోందని ప్రధాన ప్రతిపక్షం ఆక్షేపించింది. డ్వాక్రా మహిళల రుణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, ఉప్పులేని కల్పన వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి...ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

అయితే అత్యంత ముఖ్యమైన ఈ విషయంపై చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరింది.  చర్చకు స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మరో రూపంలో విషయాన్ని ప్రస్తావించాలని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో కాసేపు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టాలని స్పీకర్ సూచించారు. దీనిపై ఓవైపు సభ్యులు మాట్లాడుండగా.. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు నిరనస వ్యక్తం చేశారు. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement