సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment