నవయుగ కవితా చక్రవర్తి జాషువా
నవయుగ కవితా చక్రవర్తి జాషువా
Published Sun, Jul 24 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
విజయవాడ కల్చరల్ :
నవయుగ కవితా చక్రవర్తి జాషువాఅని వక్తలు అభిప్రాయపడ్డారు. రసభారతి సాహితీ సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా జాషువా 45వ వర్థంతి సభలను శనివారం శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిం చాయి. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జాషువా తన సాహిత్యం ద్వారా వేలమంది యువకవులను ప్రభావితం చేశాడన్నారు. జాషువా పిరదౌసీ కావ్యంపై డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు, జాషువా కవితా వైభవం పై డాక్టర్ జంధ్యాల మహతీ శంకర్, ఆయన సాహిత్యంలో మానతా విలువలపై డాక్టర్ గుమ్మా సాంబశివరావు, జాషువా భావుకతపై పింగళి వెంకటకృష్ణారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో రసభారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ పాల్గొన్నారు. అనంతరం కవి పండితులను జ్యోతిష్యశాస్త్రవేత్త రామన్, వ్యాపార వేత్త చెట్టపల్లి మారుతీ ప్రసన్నలు సత్కరించారు.
Advertisement