కురుపాం:
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను శాసనమండలి సభ్యుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కురుపాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. నాలుగో ఏడాది జగనన్న అమ్మఒడి నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసే బృహత్తర కార్యక్రమానికి కురుపాం వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా సీఎం రాకకు వీలుగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్, కురుపాం నుంచి చినమేరంగి వెళ్లే రహదారి సమీపంలోని సెయింట్ మాంట్ ఫోర్ట్ పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో బహిరంగ సభావేదికను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజలు తరలివస్తారనే ఆలోచనతో భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. హెలిప్యాడ్, సభాస్థలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, పారిశుద్ధ్యం నిర్వహణ అంశాలపై దృష్టిసారించాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోవిందరావు, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు సి.విష్ణుచరణ్, కల్పనాకుమారి, డీఆర్వో జె.వెంకటరావు, సబ్‌కలెక్టర్ నూరుల్‌కమర్, ఆర్డీఓ హేమలత, అదనపు ఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్‌కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
సభాస్థలాన్ని పరిశీలించిన పాలకులు, అధికారులు
ఏర్పాట్లపై సూచనలిచ్చిన సీఎం
కార్యక్రమ సమన్వయ కర్త
తలశిల రఘురాం
పాల్గొన్న జెడ్పీ చైర్మన్, ఎమ్సీల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు
బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కురుపాం నియోజకవర్గ కేంద్రానికి వస్తున్న సందర్భంగా బహిరంగ సభా ప్రాంతం, హెలిప్యాడ్ పరిసరాలను పోలీసులు తనిఖీ చేశారు. బాంబ్‌స్క్వాడ్ బృందం నిశితంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment