vijayawada lok sabha constituency
-
28న కురుపాంకు సీఎం జగన్మోహన్రెడ్డి
కురుపాం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను శాసనమండలి సభ్యుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కురుపాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. నాలుగో ఏడాది జగనన్న అమ్మఒడి నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసే బృహత్తర కార్యక్రమానికి కురుపాం వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా సీఎం రాకకు వీలుగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్, కురుపాం నుంచి చినమేరంగి వెళ్లే రహదారి సమీపంలోని సెయింట్ మాంట్ ఫోర్ట్ పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో బహిరంగ సభావేదికను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజలు తరలివస్తారనే ఆలోచనతో భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. హెలిప్యాడ్, సభాస్థలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, పారిశుద్ధ్యం నిర్వహణ అంశాలపై దృష్టిసారించాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోవిందరావు, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు సి.విష్ణుచరణ్, కల్పనాకుమారి, డీఆర్వో జె.వెంకటరావు, సబ్‌కలెక్టర్ నూరుల్‌కమర్, ఆర్డీఓ హేమలత, అదనపు ఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్‌కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. సభాస్థలాన్ని పరిశీలించిన పాలకులు, అధికారులు ఏర్పాట్లపై సూచనలిచ్చిన సీఎం కార్యక్రమ సమన్వయ కర్త తలశిల రఘురాం పాల్గొన్న జెడ్పీ చైర్మన్, ఎమ్సీల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కురుపాం నియోజకవర్గ కేంద్రానికి వస్తున్న సందర్భంగా బహిరంగ సభా ప్రాంతం, హెలిప్యాడ్ పరిసరాలను పోలీసులు తనిఖీ చేశారు. బాంబ్‌స్క్వాడ్ బృందం నిశితంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. -
పొట్లూరి ఆశలపై నీళ్లుచల్లిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ ఆశలపై సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు. పవన్ మద్దతుతో టీడీపీ టిక్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని పొట్లూరి భావించారు. దీని కోసం పవన్ మద్దతు కోసం ఆయనతో ఈరోజు సంప్రదింపులు జరిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని సమాచారం. పవన్‌ను ఒప్పించేందుకు పొట్లూరి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమీరా అన్నారని తెలిసింది. పవన్ మద్దతు నిరాకరించడంతో పోటీ చేయడానికి పొట్లూరి వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు తమకు టిక్కెట్ దక్కకుండా చేసిన కేశినేని నానిని ఓడించాలని పొట్లూరి వర్గం వ్యూహాలు పన్నుతోంది. వరప్రసాద్ పోటీ చేసినా, చేయకపోయినా కేశినేనిని ఓడించాలని పొట్లూరి వర్గం పట్టుదలతో ఉంది. నామినేషన్ దాఖలుకు శనివారం వరకు గడువు ఉండడంతో పొట్లూరి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి, విజయవాడ/ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయన కార్యాలయం కార్యకర్తలతో నిండిపోయింది. ఎండ మండుతున్నా ఆయనతోపాటు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నడిచారు. బెంజిసర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు, మదర్ థెరిస్సా విగ్రహం జంక్షన్, సిద్ధార్థ కళాశాల, మొగల్రాజపురం, పుష్పాహోటల్, రెడ్‌సర్కిల్, గోపాలరెడ్డి రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయూనికి ర్యాలీగా వచ్చారు. అనంతరం కోనేరు నాలుగు సెట్ల నామిషన్లను దాఖలు చేశారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, తూర్పు, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల అభ్యర్థులు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతమ్‌రెడ్డి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతా : కోనేరు ప్రజలతో మమేకమై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోనేరు రాజేంద్రప్రసాద్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై అపార నమ్మకంతో విజయవాడ ఎంపీ సీటును కేటారుుంచారని పేర్కొన్నారు. ఆయన నమ్మకానిన నిలబెట్టుకుంటానన్నారు. భగవంతుని ఆశీస్సులు, తన కుటుంబ సభ్యుల సహకారంతో స్వతహాగా కొన్ని ప్రణాళికలు, మరికొన్ని ప్రభుత్వపరంగా చేపట్టి అభివృద్ధి చేస్తాన్నారు. గతంలో కొందరు నాయకులు చెప్పిన విధంగా రాత్రికి రాత్రే నగరాన్ని వెనీస్ గానో, సింగపూర్ గానో మారుస్తానని తాను చెప్పనని, ఇప్పుడున్న దీనస్థితి నుంచి ముందుకు తీసుకువెళతానని పేర్కొన్నారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తానని, ఎక్కడా మురుగు నీరు నిలువకుండా ప్రణాళికను అమలు చేస్తామన్నారు. మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు అందించేందుకు కృషిచేస్తానన్నారు. నగరంలోనే ఉంటా.. ఎట్టిపరిస్థితిలోను నియోజకవర్గాన్ని విడిచి వెళ్లనని, విజయవాడ వాసిగానే ఉంటానని మీడియూ ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు కోనేరు సమాధానమిచ్చారు. నగరం గురించి తనకు అంతా తెలుసని, కొందరు నాయకుల మాదిరిగా ఒక రోజు ఇక్కడ మిగిలిన 364 రోజులు వేరే ప్రాంతాల్లో ఉండనని ఆయన ప్రకటించారు. రాజధానిగా విజయవాడ చేస్తారా.. అని ప్రశ్నించగా.. ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతమని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రం విడిపోదని చెప్పిన వారే నేడు రాజధాని కావాలని, ప్యాకేజీలు కావాలని తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. కేవలం రాజధానే ముఖ్యం కాదని, అంకితభావం చిత్తశుద్ధితోనే అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. -
విజయవాడ బరిలో నిలిచేదెవరు?
* కేశినేని నాని, పొట్లూరి అభ్యర్థిత్వంపై టీడీపీ తర్జన భర్జన * లోక్‌సభ సీటు కోసం ఇద్దరూ చంద్రబాబుపై ఒత్తిడి * పవన్ అండ ఉన్న పొట్లూరివైపే టీడీపీ అధినేత మొగ్గు * ఓ మీడియా అధిపతి జోక్యంతో నానికే టికెట్ ఖరారైనట్లు ప్రచారం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దింపాలన్న విషయంపై టీడీపీ తర్జనభర్జన పడుతోంది. ఇక్కడి నుంచి తానే పోటీచేస్తానని కేశినేని ట్రావెల్స్ యజమాని కేశినేని నాని పట్టుబడుతుంటే, సినీనటుడు పవన్‌కల్యాణ్ మద్దతుందని చెప్పుకుంటున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ అంతకంటే ఎక్కువగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కేశినేని నానియే అక్కడ పార్టీ అభ్యర్థి అవుతారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం కొందరు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. మరోవైపు పొట్లూరి వరప్రసాద్‌కు టికెటిస్తే పార్టీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. చంద్రబాబు సైతం పవన్ పేరును ముందు పెట్టి బీజేపీని ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పొట్లూరికి మార్గం సుగమమైందన్న విషయం తెలిసిన నానీ వర్గం భగ్గుమంది. పవన్‌కల్యాణ్‌తో పాటు పొట్లూరిపై నాని విమర్శలకు దిగారు. ఆ సీటు నుంచి తానే పోటీచేస్తానని తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. నానీని పిలిచి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా తగ్గేది లేదని భీష్మించారు. విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓ మీడియా అధిపతి జోక్యం చేసుకున్నారు. నానికే టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తాజాగా నానీకే టికెట్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎవరెంత ప్రచారం చేసుకున్నా తానే విజయవాడ ఎంపీ అభ్యర్థినని, ఈ విషయంలో చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌కు హామీనిచ్చారని పొట్లూరి వరప్రసాద్ ధీమాగా చెబుతున్నారు. కాగా, చంద్రబాబుతో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే దిరశం పద్మజ్యోతి సోమవారం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ సీటును ఆమె ఆశిస్తున్నారు. ఈ మేరకు బాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.