సాక్షి, విజయవాడ: తన వయసుకు తగినట్టు రామోజీరావు నడుచుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. రామోజీరావుకు ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అంబేద్కర్ గురించి కథనాలు రాశారు. సీఎం జగన్‌కు అర్హత లేదని రామోజీ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిండచమే అవుతుందన్నారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. సీఎం జగన్‌కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని చెప్పడానికి రామోజీకి ఏం అర్హత ఉంది. ఆయన వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది.
చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్‌సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment