ambetkar statue
-
పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం -
అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై మంత్రుల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధికారులకు ఆదేశించారు. -
గరగపర్రు సమస్యకు పరిష్కారం
చెరువుగట్టున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒప్పందం ఇరువర్గాలు చేతులు కలిపి.. కలసిమెలసి జీవిస్తామంటూ హామీ దళితవాడలో సౌకర్యాలు కల్పిస్తామని మంత్రుల భరోసా భీమవరం: ఉండి నియోజవర్గంలోని గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ సమస్య పరిష్కారమైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి నక్కా ఆనందబాబు, కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ రెండు రోజులు పాటు చర్చలు జరిపి అగ్రవర్ణాలు, దళితుల పెద్దలతో చేతులు కలిపి భాయిభాయి అనిపించి మంగళవారం వివాదానికి శుభం కార్డు వేశారు. అయితే దాదాపు నాలుగు నెలల పాటు సాగిన వివాదంలో ప్రభుత్వ పరంగా బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం పంపిణీ తప్ప ఇతరత్రా ఎటువంటి ప్రయోజనం సమకూరకపోవడం విశేషం. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏప్రిల్‌లో మంచినీటి చెరువుగట్టున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. గ్రామంలో 14 కులాలు ఒక వైపు దళితులంతా ఒక వైపు ఉండి దాదాపు మూడు నెలల పాటు ఉద్యమాన్ని నడిపించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోయింది. మేము దళితులను సాంఘిక బహిష్కరణ చేయలేందటూ దళితేతరులు చెబుతుండగా.. తామ సాంఘిక బహిష్కరణకు గురై తీవ్ర మానసిక క్షోభ, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక బహిష్కణకు కారకుడైన ప్రధాన నిందితుడు ఇందుకూరి బలరామకృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తరువాత బలరామకృష్ణంరాజుతోపాటు మరో ఇరువుర్ని అరెస్టు చేశారు. ఈనెల 24న రాష్ట్ర మంత్రులు ఆనందబాబు, జవహర్, పితాని సత్యనారాయణ గరగపర్రు గ్రామం దళితవాడలో సమావేశం ఏర్పాటుచేసి గ్రామంలోని 63 కుటుంబాలకు రూ. లక్ష సాంఘిక సంక్షేమశాఖ నిధులు పరిహారంగా అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే 335 కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో ఎవరికీ సహాయం అందించకుండానే ఆరోజు చర్చలు ముగిశాయి. తిరిగి మంగళవారం పాలకోడేరులోని మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో దళితుల తరపున శిరంగుల వెంకటతర్నం, ఎరిచర్ల రాజేష్, విప్పర్తి ఏసుపాదం, విజయకుమార్, రెండవ వర్గం తరపున చింతలపాటి సూర్యనారాయణరాజు, ముదునూరి రామకృష్ణంరాజు, అన్నవరం, మేకల చంద్రరావు, అబ్బులు పెద్దలుగా వ్యవహరించడంతో రెండు వర్గాలు శాంతియుతంగా ఎటువంటి అరమరికలు లేకుండా జీవిస్తామంటూ చేతులు కలిపాయి.