సాక్షి, విజయవాడ: టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.
ఈ సందర్బంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా నేను రాజీనామా చేశాను. రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీకి రాజీనామా చేస్తాను. మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు. టీడీపీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు. పార్టీకి తర్వాత కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారు. గౌరవం లేని చోట మేము పనిచేయలేము. కేశినేని నాని, నేను ప్రజల తరుపున పోరాటం చేస్తాము.
గత సంవత్సరం కాలం నుంచి టీడీపీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము బయటకి వెళ్తున్నము.. పార్టీ నుంచి మాతో వచ్చే వాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటాము. తిరువూరు సభకి కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ అడిగారు. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు సంబంధం ఏంటి అని అడగడం లోకేష్ తెలివితేటలకు నిదర్శనం. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారు’ అని కామెంట్స్ చేశారు.
ఇక, అంతకుముందు కేశినేని శ్వేత, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా, వీరి రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది.
అందరికీ నమస్కారం 🙏🏼
ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ— Kesineni Nani (@kesineni_nani) January 7, 2024
Comments
Please login to add a commentAdd a comment