సాక్షి, హైదరాబాద్: సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నింటితో స్నేహభావాన్ని, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నట్లు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవి చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలపై రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్..‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు.
శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేవంత్‌కు శుభాకాంక్షలు చెబతూ..‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023
Comments
Please login to add a commentAdd a comment