Sooraj
-
కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే!
భోపాల్: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి(సూరజ్) శుక్రవారం మృత్యువాత పడింది. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7 చిరుత పులులు చనిపోగా సూరజ్ మృతితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. దాని వయసు నాలుగు సంవత్సరాలు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత పులులు ఒక్కొక్కొటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. నాలుగు రోజుల క్రితం మగ చిరుత తేజాస్ చనిపోయిన సంఘటన మరిచిపోక ముందే సూరజ్ చనిపోవడం కునో జాతీయవనం వర్గాలను కలవరపెడుతోంది. సూరజ్ మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతకుముందు ఆడ చిరుత సియాయ(జ్వాల) నాలుగు చిరుత కూనలకు జన్మనివ్వగా అందులో రెండు చనిపోయిన సంగతి తెలిసిందే. అవి డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయని జాతీయ వనం సిబ్బంది తెలియజేశారు. తేజాస్ మాత్రం కొట్లాటలో గాయపడి చనిపోయింది. సూరజ్ మరణంతో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొత్తం ఎనిమిది చనిపోగా కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం పది చిరుతలు మాత్రమే మిగిలున్నాయి. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
నిజమైన ప్రేమకథ
సూరజ్, రవీంద్రతేజ, సానియా, ఫారా ముఖ్యతారలు గా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2 ఫ్రెండ్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ట్రూ లవ్ స్టోరి అనేది ఉపశీర్షిక. ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్ ఇవ్వగా, నటుడు విజయ్‌చందర్ స్విచ్చాన్ చేశారు. ఓంప్రకాశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కథ తయారు చేయడానికి ఏడాది పట్టింది. పాటల రికార్డింగ్ పూర్తయింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సంబంధించిన మంచి కథ ఇది’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంటుంది’’ అన్నారు నిర్మాత అనంతరాముడు. సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
ఇద్దరి స్నేహితుల కథ
ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహాన్ని ప్రేమగా అపార్థం చేసుకోవడం వల్ల ఇద్దరి స్నేహితుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే కథతో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్... అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి. దర్శకత్వంలో అనంతలక్ష్మి కియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరో సూరజ్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇందులో రవీంద్ర తేజ మరో హీరో. సానియా, ఫారా హీరోయిన్లు. ఈ నెల 9న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. ‘‘స్నేహం, ప్రేమ, త్యాగం ప్రధానాంశాలుగా సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర చేయనున్న ఈ సినిమాకు పొలూర్ ఘటికాచలం çసంగీత దర్శకుడు. -
బాడీగార్డ్‌కు సల్మాన్ సాయం
వెండితెర మీద కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్‌లు ఇవ్వటంతో పాటు ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలింస్ ద్వారా కొత్త హీరోలను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్యే సూరజ్ పంచోలి, అతియా శెట్టిలను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్, త్వరలోనే అతియా తమ్ముడు అహాన్ శెట్టిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇదే వరుసలో మరోసారి తన పెద్దమనసు చాటుకుంటున్నాడు కండల వీరుడు. చాలా కాలంగా సల్మాన్ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేస్తున్న షేరా కుమారుడు టైగర్‌ను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు సల్మాన్. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నాడట. 22 ఏళ్ల టైగర్‌కు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు
బాలీవుడ్ న్యూ జనరేషన్‌కి సల్మాన్ ఖాన్ లాంచ్ ప్యాడ్లా మారుతున్నాడు. స్టార్ హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేయడానికి సల్మాన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వారసులని పరిచయం చేసిన కండల వీరుడు త్వరలోనే మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. 2010లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాదించిన ఈ బ్యూటీ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దీంతో సల్మాన్ ది గోల్డెన్ హ్యాండ్ అని ఫిక్స్ అయ్యారు అంతా. ఇటీవల 'హీరో' సినిమాతో ఆదిత్య పంచౌలి కొడుకు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలను వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఈ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా, మంచి వసూళ్లను రాబట్టి ఈ ఇద్దరు వారసులను కమర్షియల్‌గా నిలబెట్టింది. తాజాగా మరో వారసుడిని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న అహాన్ త్వరలోనే సల్మాన్ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
'మీరు మీ తండ్రుల పేర్లు నిలబెడతారు'
ముంబయి: కొత్త చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నవతరం నటులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. వారి చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'దిల్వాలే' చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం ఐస్ లాండ్లో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త నటులు సూరజ్ పంచౌలీ, ఆదిత్య శెట్టి నటిస్తున్న చిత్రం హీరో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వారికి తన అభినందనలు తెలియజేస్తూ నటవారసులనిపించుకుంటారని, వారి తండ్రుల పేరు నిలబెడతారని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా ఉన్నారు.