బాడీగార్డ్కు సల్మాన్ సాయం | Salman Khan introducing his bodygaurd son to silver screen | Sakshi
Sakshi News home page

బాడీగార్డ్కు సల్మాన్ సాయం

Published Thu, Nov 12 2015 9:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

బాడీగార్డ్కు సల్మాన్ సాయం

బాడీగార్డ్కు సల్మాన్ సాయం

వెండితెర మీద కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్లు ఇవ్వటంతో పాటు ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలింస్ ద్వారా కొత్త హీరోలను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్యే సూరజ్ పంచోలి, అతియా శెట్టిలను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్, త్వరలోనే అతియా తమ్ముడు అహాన్ శెట్టిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు.

ఇదే వరుసలో మరోసారి తన పెద్దమనసు చాటుకుంటున్నాడు కండల వీరుడు. చాలా కాలంగా సల్మాన్ దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న షేరా కుమారుడు టైగర్ను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు సల్మాన్. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నాడట. 22 ఏళ్ల టైగర్కు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement