తండ్రి తర్వాతే అన్నీ..
Published Sat, Mar 1 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
సినిమాల్లేవు.. కొత్త ప్రాజెక్టులపై సంతకాలూ చేయలేదు. కనీసం కూతురు తొలిసారిగా సినిమాలో నటిస్తుందన్న ఉత్సాహమూ సునీల్ శెట్టిలో కనిపించడం లేదు. ఎంతగానో ప్రేమించే తండ్రి అనారోగ్యంతో ఉండడమే మనోడి బాధకు కారణం. ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ఉద్దేశంతో దక్షిణ ముంబైలోని తన ఇంటినే ఐసీయూగా మార్చా డు. ‘మూడు నెలలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. సంతో షం, బాధ కలగలిసిన సమయమిది. ఒకవైపు తండ్రి ఆరోగ్యం బాగాలేదు. కూతురు ఆథియా సిని మాల్లోనూ నటిస్తుందనే సంతోషం మాత్రం ఉంది’ అని సునీల్ వివరించా డు. సూరజ్ పంచోలీ నాయకుడిగా రాబోతున్న ‘హీరో’ సినిమా షూటింగ్‌కోసం ఆథియా ప్రస్తుతం మనాలీలో ఉంది. తండ్రి అనారోగ్యం సునీల్‌ను బాగా కుంగదీసింది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. దీనికితోడు అఫ్తాబ్ శివ్‌దాసానితో గొడపడ్డాడంటూ వచ్చిన వార్తలు తనను మరింత బాధపెట్టాయని ఇతడు వాపోయాడు. ‘అఫ్తాబ్ లాంటి సున్నిత, మంచి మనిషితో గొడవలు ఎలా పెట్టుకుంటాను ? అసలే మనోవేదనతో బాధపడుతున్న నాకు ఇలాంటి కథనా లు చదివినప్పుడు మరింత బాధకలుగుతోంది’ అని చెప్పా డు. సినిమాల గురించి మాట్లాడుతూ అవకాశాలు ఎప్పుడైనా వస్తాయని, ప్రస్తుతం తండ్రితో గడపడమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశాడు. అయితే ఆథియా పరాయి రాష్ట్రంలో ఉన్నా ఆమె గురిం చి తనకు బెంగేమీ లేదని తెలిపాడు. ‘ఆమె పూర్తి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్ యూనిట్ అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే. ఆథియా, సూరజ్‌ను వాళ్లు సొంత బిడ్డల్లా చూసుకుంటారు’ అని సునీల్ శెట్టి వివరించాడు.
Advertisement
Advertisement