బోర్డర్‌ సీక్వెల్‌లో అహన్‌ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్‌ అంటూ ఎమోషనల్‌! | Ahan Shetty In Border 2 Movie | Sakshi
Sakshi News home page

బోర్డర్‌ సీక్వెల్‌లో అహన్‌ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్‌ అంటూ ఎమోషనల్‌!

Published Sat, Oct 5 2024 3:03 PM | Last Updated on Sat, Oct 5 2024 5:20 PM

Ahan  Shetty In Border 2 Movie

బాలీవుడ్‌ ‘బోర్డర్‌’ సీక్వెల్‌ ‘బోర్డర్‌ 2’లో జాయిన్‌ అయ్యారు అహన్‌ శెట్టి. సన్నీ డియోల్‌ హీరోగా, వరుణ్‌ ధావన్, దిల్జీత్‌ సింగ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బోర్డర్‌ 2’. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో అహన్‌ శెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు  చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 

‘‘బోర్డర్‌’ సినిమాతో నా అనుబంధం 29 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. మా నాన్న (బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి) ‘బోర్డర్‌’ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మ సెట్స్‌కు వెళ్లేది. అప్పుడు మా అమ్మ గర్భవతి. నేను మా అమ్మ గర్భంలో శిశువుగా ఉన్నాను. ఆ తర్వాత జేపీ దత్తా (‘బోర్డర్‌’ సినిమా దర్శకుడు, ‘బోర్డర్‌ 2’ నిర్మాత) అంకుల్‌ చెప్పే కథలు వింటూ, ఆయన చేయి పట్టుకుని నడిచాను... పెరిగాను. నా జీవితంలోని ఇలాంటి అనుభవాలే నాకు సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేశాయి. 

‘‘ఇప్పుడు నేను ‘బోర్డర్‌ 2’ సినిమాలో ఓ రోల్‌ చేయనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సన్నీ డియోల్‌ సార్‌తో వర్క్‌ చేయబోతున్నాను. దిల్జీత్‌గారికి నేను అభిమానిని. వరుణ్‌ ధావన్‌గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారి వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు అహన్‌ శెట్టి. ‘బోర్డర్‌ 2’ చిత్రాన్ని 2026 జనవరి 23న రిలీజ్‌ చేయనున్నారు. ఇక సన్నీ డియోల్, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్‌ ఖన్నా లీడ్‌ రోల్స్‌లో నటించిన హిందీ ‘బోర్డర్‌’ 1997లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జేపీ దత్తా దర్శకత్వం వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement