
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు.
కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.
భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్‌ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్‌లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment