Border 2 Movie
-
బోర్డర్ సీక్వెల్లో అహన్ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్ అంటూ ఎమోషనల్!
బాలీవుడ్ ‘బోర్డర్’ సీక్వెల్ ‘బోర్డర్ 2’లో జాయిన్ అయ్యారు అహన్ శెట్టి. సన్నీ డియోల్ హీరోగా, వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో అహన్ శెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ‘‘బోర్డర్’ సినిమాతో నా అనుబంధం 29 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. మా నాన్న (బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి) ‘బోర్డర్’ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మ సెట్స్‌కు వెళ్లేది. అప్పుడు మా అమ్మ గర్భవతి. నేను మా అమ్మ గర్భంలో శిశువుగా ఉన్నాను. ఆ తర్వాత జేపీ దత్తా (‘బోర్డర్’ సినిమా దర్శకుడు, ‘బోర్డర్ 2’ నిర్మాత) అంకుల్ చెప్పే కథలు వింటూ, ఆయన చేయి పట్టుకుని నడిచాను... పెరిగాను. నా జీవితంలోని ఇలాంటి అనుభవాలే నాకు సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేశాయి. ‘‘ఇప్పుడు నేను ‘బోర్డర్ 2’ సినిమాలో ఓ రోల్ చేయనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సన్నీ డియోల్ సార్‌తో వర్క్ చేయబోతున్నాను. దిల్జీత్గారికి నేను అభిమానిని. వరుణ్ ధావన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారి వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు అహన్ శెట్టి. ‘బోర్డర్ 2’ చిత్రాన్ని 2026 జనవరి 23న రిలీజ్ చేయనున్నారు. ఇక సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ ‘బోర్డర్’ 1997లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జేపీ దత్తా దర్శకత్వం వహించారు. -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు. కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.