
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment