Anurag Singh
-
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
గత మేనిఫెస్టోలపై చర్చకొస్తారా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర సమాచార, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఎన్.రామచంద్రరావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్ లతో కలసి ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఇ చ్చిన ఎన్నికల హామీల్లో ఎన్ని నెరవేర్చారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందన్నారు. దీనికోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తే రైతులకు నీరు రాకపోగా పియర్లు కుంగాయని, ఇందులో రూ. వేల కోట్లు లూటీ అయ్యాయని ఆరోపించారు. సీఎంకు డబ్బుపై అంత మోజెందుకని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు అవినీతి, అక్రమాల వెనుక ఉన్న సూత్రధారి, ఫామ్‌హౌస్‌లో ఉండే వ్యక్తి పేరు తాను చెప్పాల్సిన అవసరం లేదని... తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టంపై విచారణ జరిగి అందుకుగల కారకులకు జైలుశిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం డ్యామ్ సురక్షితం కాదని తేలిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలన అవినీతిమయం... బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అవినీతికూపంలో మునిగిపోయిందని, సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువతను మోసం చేశారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. కొడుకు, కూతురు అవినీతికి కేసీఆర్ రక్షణగా నిలిచారని దుయ్యబట్టారు. తెలంగాణలో అక్రమ సంపాదనతో కడుపు నిండక ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగస్వాములయ్యారని, ఈ కేసు విచారణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నంబర్ కూడా త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ స్కాం సూత్రధారి అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు అందాయని... డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారని... ఈ కేసుతో సంబంధమున్న ఎమ్మెల్యేలపైనా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పోరాడాయని, రాష్ట్రానికి 9 ఏళ్లలో రూ. 9 లక్షల కోట్లు కేంద్రం కేటాయించిందని ఠాకూర్ తెలిపారు. కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు, తదితర హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ‘సట్టా’మార్గంలో కాంగ్రెస్ ‘సత్తా’చాటాలనుకుంటోంది... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విదేశీ శక్తులు, విదేశీ డబ్బుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ‘సట్టా’(జూదం) మార్గంలో సత్తా (అధికారానికి) చాటాలని కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. దీనిపై రాహుల్ గాందీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఓ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 508 కోట్లు ముట్టినట్లు ఈడీ పేర్కొందని చెప్పారు. రాజస్తాన్‌లో ఏకంగా సీఎంవో అధికారి వద్ద రూ. 2 కోట్లు, కేజీ బంగారం దొరికిందన్నారు. కర్ణాటక నుంచి రూ. కోట్లను తెలంగాణకు తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. -
రెండోలైన్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని రెండు ప్రధాన రూట్లతో రైల్వే ప్రాజెక్టులకు లైన్‌క్లియర్ అయ్యింది. ముద్ఖేడ్–మేడ్చల్–మహబూబ్‌నగర్–డోన్, గుంటూరు–బీబీనగర్ సెక్షన్ల మధ్య రెండో రైల్వేలైన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ రెండు రైల్వే రూట్లలో ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల క్రితమై మంజూరై, సర్వేలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏడు ప్రాజెక్టులకు మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ల అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే ముద్ఖేడ్– డోన్, గుంటూరు– బీబీనగర్ ప్రాజెక్టులను రూ. 7,539 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు మంజూరు చేస్తారు. ► సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ వరకు డబ్లింగ్ పనులు రెండు భాగాలుగా కొనసాగుతాయి. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే...సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రెండోదశ కింద రెండో లైన్ పూర్తయింది. ఇప్పుడు మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వయా నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ► ఇక సికింద్రాబాద్ టు డోన్ రూట్లో ఇప్పటికే మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తయింది. ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రెండో రైల్వేలైన్ పనులు చేపడతారు. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్లో ప్రస్తుతం సింగిల్ రూట్ ఉన్న కారణంగా లైన్ సామర్థ్య వినియోగం 167 శాతానికి చేరుకుంది. ట్రాఫిక్ అధికంగా ఉండటం, సామర్థ్యానికి మించి రైళ్లు తిరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డిమాండ్ దృష్ట్యా కొత్త రైళ్లు నడపటం సాధ్యం కావటం లేదు. దీంతో డబ్లింగ్ అనివార్యమైంది. మూడేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరు చేసినా, నిధుల విడుదలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ► ముద్ఖేడ్ ఆవల మన్మాడ్ వరకు వెళ్లి ప్రధాన ట్రంక్ లైన్‌తో కలుస్తుంది. ముద్ఖేడ్ తర్వాత పర్బణి–మన్మాడ్ మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, ఇప్పుడు ఈ పనులు మొదలవుతున్నాయి. ఇది పూర్తయితే, అటు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి అనుసంధానం అయ్యే ప్రధాన ప్రత్యా మ్నాయ మార్గంగా మారుతుంది. అప్పుడు బెంగుళూరు–హైదరాబాద్–ముంబై ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల సంఖ్య పెరగటంతోపాటు వాటి వేగం పెరుగుతుంది. ట్రంక్ లైన్‌తో పోలిస్తే దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుంది. ► బల్హర్షా–కాజీపేట–సికింద్రాబాద్, కాజీపేట –విజయవాడ సెక్షన్ల మధ్య కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బల్హర్షా–రామగుండం–సికింద్రాబాద్–వాడి– గుంతకల్ సెక్షన్లకు బొగ్గు, స్టీల్ రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. ► హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే రూట్లో బీబీనగర్‌కు డబ్లింగ్ ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు మీదుగా తెనాలి వద్ద ప్రధాన లైన్‌ను కలిసే ప్రత్యామ్నాయమార్గంగా బీబీనగర్–గుంటూరు మధ్య రెండో లైన్ నిర్మా ణానికి రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్రం కనికరం చూపి దానికి నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్– విజయవాడ ప్రధాన లైన్‌పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్రంక్‌లైన్ సామర్థ్యానికి మించి 137 శాతం వినియోగంలో ఉంది. ఫలితంగా కొత్త రైళ్లు నడిపేందుకు కష్టంగా మారింది. ౖòప్రధాన ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే కీలక ప్రాజెక్టు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గుంటూరు–బీబీనగర్ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం 148 శాతంగా ఉంది. రెండో లైన్నిర్మాణంతో ఆ సమస్య పరిష్కారమై కొత్త రైళ్లు ఆ మార్గంలో మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. కొన్నేళ్లలో ఈ మార్గంలో కొత్తగా సిమెంటు కార్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► ఇనుము–ఉక్కు: చిట్యాల– నార్కట్‌పల్లి . ► సిమెంట్ ప్లాంట్లు: విష్ణుపురం, నడికుడి, తుమ్మలచెరువు, జాన్‌పహాడ్, మేళ్లచెరువు, మఠంపల్లి, జగ్గయ్యపేట, రామాపురం ► థర్మల్ పవర్ ప్లాంట్: విష్ణుపురం సమీపంలో 4000 ఎంవీ థర్మల్ ప్లాంట్ (అందుబాటులోకి రావాలి) ► ఆహార ధాన్యాలు: నాగిరెడ్డిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్‌సీఐలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విష్ణుపురం, నార్కట్‌పల్లి ► గిడ్డంగులు: హైదరాబాద్ చుట్టూ 100కి పైగా వేర్ హౌస్‌లు – గుంటూరు చుట్టూ 50కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► బొగ్గు: రామగుండం, మంచిర్యాల, మందమర్రి ► ఆర్థిక కారిడార్లు: రాయచూరు–దేవరకద్ర, కర్నూలు –పీలేరు, కొడంగల్–మహబూబ్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్–చిట్యాల, సంగారెడ్డి–హైదరాబాద్, ముత్తంగి–మంచిరేవుల ► థర్మల్ పవర్ ప్లాంట్లు: పర్లి వద్ద మహా జెన్కో కర్ణాటకలోని రాయచూర్, యెర్మరస్లో కేపీసీసీ, ఆంధ్రప్రదేశ్‌లోని ముద్దనూరు వద్ద ఏపీజెన్కో ► ఆహార ధాన్యాల తరలింపు ప్రాంతాలు: ముద్ఖేడ్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, నిజామాబాద్, నాందేడ్ , మెదక్, కర్నూలు, గద్వాల, ఇటిక్యాల, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి ► గిడ్డంగులు–శీతల గిడ్డంగులు: నిజామాబాద్, బోధన్ , సారంగాపూర్ , బండమల్లారం , మహబూబ్‌నగర్, గద్వాల ఖోర్దా రోడ్ –విజయ నగరం రూట్లో.. భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖోర్దా రోడ్–విజయనగరం రూట్లో ఒడిశాలోని భద్రక్, జజ్పూర్, ఖోర్దా, కటక్, గంజాం జిల్లాలో 184 కి.మీ, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోని 201 కి.మీ మేర మూడోలేన్ పనులు జరుగుతాయి. దీనికి రూ.5618.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ముద్ఖేడ్ –మేడ్చల్, మహబూబ్‌నగర్ –డోన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ నుంచి ముంబై, పూణె, షిరిడీలతో పాటు నిజామాబాద్ నుంచి బెంగళూరుల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగి, ప్రయాణ మార్గం సులభతరం అవుతుందన్నారు. -
CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం
‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. సీఐఐ దక్షిణ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది. సీఐఐ చైర్మన్ టీజీ త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్ అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్ ఐకాన్ అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు. -
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా విరాళాలెలా వచ్చాయి? ..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ చందాలు ఎవరెవరు ఇచ్చారు? ఎందుకిచ్చారో రాహుల్‌గాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతున్నప్పుడు రాహుల్‌గాంధీ చైనా అధికారులతో కలిసి విందులో పాల్గొన్నారని, ఆ విందు కేంద్రంగా ఎలాంటి ప్రణాళికలు రచించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అనురాగ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ మన దేశ సైనికులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రానికి ఎన్నో స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణకు మాత్రం రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్సీ కేంద్రాలు తెరుస్తామని చెప్పారు. (చదవండి: అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!) -
రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది. జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్‌ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందని సమాచారం. మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు. మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది. -
పన్ను చెల్లింపుదారుల గుర్తింపునకు పోర్టల్
న్యూఢిల్లీ: దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరులకు గౌరవం’’ పేరుతో ఏర్పాటైన ఓ ప్లాట్ఫార్మ్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేస్తామని బుధవారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రధాని ఆన్లైన్ పద్ధతిలో ప్లాట్ఫార్మ్ను ప్రారంభిస్తారని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొంటాయని ఆ ప్రకటన తెలిపింది. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గత ఏడది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని ఈ ప్రకటనలో వివరించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
నిజాయతీగా ఉంటే... భయపడాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: బ్యాంకులు దేశ ప్రయోజనాల కోణంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు వేధింపులకు గురి చేస్తాయన్న భయం వద్దని కేంద్ర ఆరి్థక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ముంబైలో బుధవారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి మద్దతుగా నిలబడుతుంది. మంచి విశ్వాసంతో, నిజాయతీగా బ్యాంకులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో ఏ దర్యాప్తు సంస్థ సైతం తీవ్రంగా పరిగణించడం జరగదు. ఈ విషయంలో నాది హామీ. బ్యాంకులు, దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఠాకూర్ పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకున్న భారీ మోసాలు, రుణ అవకతవకలు, ఎన్పీఏ కేసుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉన్నతోద్యోగులు సమన్లు అందుకుని విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాల మంజూరి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ఆ రూమర్లు నమ్మొద్దు: సల్మాన్
ముంబయి: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇంతకీ ఆ ఊకార్లు సల్లూభాయ్ పెళ్లి గురించి కాదులెండి. మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో చేసే సినిమా గురించి. అసలు విషయం ఏంటంటే... అక్షయ్ కుమార్ హీరోగా సల్మాన్ ఖాన్ నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. మరో విశేషం ఏంటంటే దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కినట్లు వచ్చిన వార్తలను సల్మాన్ తోసిపుచ్చాడు. నన్ను ఫాలో అవ్వండి కానీ...రూమర్లు ఫాలో కావద్దు అంటూ సల్మాన్ ఆదివారం ట్విట్ చేశాడు. అంతేకాకుండా అక్షయ్‌తో సినిమా చేసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. కామెడి ఎంటర్ టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలని సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఇంతకు ముందు 'హీరో' అనే చిత్రానికి సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. పంజాబీ దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి పేరు ఖరారు చేయలేదు. గతంలో అనురాగ్ జట్ అండ్ జూలియట్, రఖ్వీబ్ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. Don't follow rumors . follow me . ek baar jo maine commitment kar di toh phir...... vry much doing film with @akshaykumar — Salman Khan (@BeingSalmanKhan) 12 March 2017 -
అక్షయ్ హీరో..సల్మాన్ నిర్మాత
అక్షయ్‌కుమార్ హీరోగా సల్మాన్‌ఖాన్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని అక్షయ్, సల్మాన్, కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించారు. ముగ్గురు స్నేహితులం కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. వీరి కలయికలో సినిమా ప్రకటించగానే బాలీవుడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి నెలకొంది. -
పాక్ నుంచి ముగ్గురు దౌత్యవేత్తలు వెనక్కి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌కు చెందిన ముగ్గురు దౌత్యవేత్తలను భారత్ మంగళవారం వెనక్కి పిలిపించింది. వీరి ఫొటోలు, ఇతర వివరాలు పాక్ మీడియాలో రావడం, పాక్ వీరిపై గూఢచర్య అభియోగాలు మోపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనురాగ్ సింగ్(ప్రథమ కార్యదర్శి-వాణిజ్యం), విజయ్ కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్‌లు పాక్ నుంచి బయల్దేరారు. పలువురు భారత దౌత్యవేత్తలు దౌత్య పనుల పేరుతో తమ దేశంలో ఉగ్రవాద, విద్రోహ చర్యలను సమన్వయం చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించడం తెలిసిందే. డిప్యూటీ హై కమిషనర్‌ను పిలిచిన పాక్ ఇదిలా ఉండగా భారత దళాలు సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖ పిలిపించుకుని నిరసన తెలిపింది.