ahan shetty
-
బోర్డర్ సీక్వెల్లో అహన్ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్ అంటూ ఎమోషనల్!
బాలీవుడ్ ‘బోర్డర్’ సీక్వెల్ ‘బోర్డర్ 2’లో జాయిన్ అయ్యారు అహన్ శెట్టి. సన్నీ డియోల్ హీరోగా, వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో అహన్ శెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ‘‘బోర్డర్’ సినిమాతో నా అనుబంధం 29 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. మా నాన్న (బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి) ‘బోర్డర్’ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మ సెట్స్‌కు వెళ్లేది. అప్పుడు మా అమ్మ గర్భవతి. నేను మా అమ్మ గర్భంలో శిశువుగా ఉన్నాను. ఆ తర్వాత జేపీ దత్తా (‘బోర్డర్’ సినిమా దర్శకుడు, ‘బోర్డర్ 2’ నిర్మాత) అంకుల్ చెప్పే కథలు వింటూ, ఆయన చేయి పట్టుకుని నడిచాను... పెరిగాను. నా జీవితంలోని ఇలాంటి అనుభవాలే నాకు సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేశాయి. ‘‘ఇప్పుడు నేను ‘బోర్డర్ 2’ సినిమాలో ఓ రోల్ చేయనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సన్నీ డియోల్ సార్‌తో వర్క్ చేయబోతున్నాను. దిల్జీత్గారికి నేను అభిమానిని. వరుణ్ ధావన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారి వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు అహన్ శెట్టి. ‘బోర్డర్ 2’ చిత్రాన్ని 2026 జనవరి 23న రిలీజ్ చేయనున్నారు. ఇక సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ ‘బోర్డర్’ 1997లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జేపీ దత్తా దర్శకత్వం వహించారు. -
ప్రియురాలికి బ్రేకప్ చెప్పేసిన యంగ్ హీరో!
బాలీవుడ్ స్టార్, నిర్మాత సునీల్ శెట్టి పరిచయం అక్కర్లేని పేరు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అహన్ శెట్టి. 2021లో తడప్(ఆర్ఎక్స్ 100 రీమేక్) అనే ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం అహన్ శెట్టి తన ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 11 ఏళ్లపాటు మోడల్ తానియా ష్రాఫ్‌తో రిలేషన్షిప్లో ఉన్న అహాన్ వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఈ విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. 'అహన్‌కు, తానియా చిన్నప్పటి నుంచి తెలుసు. వారిద్దరు ఓకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పదకొండేళ్ల బంధానికి గత నెలలో ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని' తెలిపారు. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. తానియా ష్రాఫ్ పారిశ్రామికవేత్త జైదేవ్, రొమిలా ష్రాఫ్‌ల కుమార్తె. అయితే గతంలో అహాన్, తానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) View this post on Instagram A post shared by Tania Shroff (@tania_shroff) -
ఓటీటీలో తడప్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆర్ఎక్స్ 100.. టాలీవుడ్లో ఎన్నో రికార్డులను తిరగారసిందీ చిత్రం. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాలీవుడ్లో తడప్గా రీమేక్ అయిన విషయం తెలిసిందే! స్టార్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజైంది. మిలన్ లుథిరా దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతంతమాత్రమే ఆడింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది. హాట్‌స్టార్‌లో జనవరి 28 నుంచి అందుబాటులోకి రానుంది. థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు, హిందీలో దీన్ని ఎలా రీమేక్ చేశారో తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నవాళ్లు వచ్చే వారం హాట్‌స్టార్‌లో దీన్ని చూసేయండి. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
బీ టౌన్ రోడ్డుపై ఆర్ఎక్స్ 100
సౌత్ ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు ప్రముఖ బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ అహన్ శెట్టి వెళ్లింది సినిమా చూడటానికి కాదు. తన ఫస్ట్ సినిమా షూటింగ్లో జాయిన్ కావడానికి. తెలుగు హిట్ ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నారు అహన్ శెట్టి. ఈ చిత్రానికి మిలప్ లూద్రియా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తొలుత థియేటర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముస్సోరీలో మేజర్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘ఒరిజినల్ సినిమా చూశాను. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. -
బోల్డ్ లవ్ స్టోరిలో టీవీ స్టార్
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌తో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక కీలకమైన హీరోయిన్ పాత్రకు బుల్లితెర నటిని ఫైనల్ చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, ఓయ్ జెస్సీ సీరియల్స్‌తో ఆకట్టుకొని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న తారా సుతరియాను ఫైనల్ చేశారు. ఇప్పటికే అహన్, తారాలు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. -
లొకేషన్ల వేటలో ‘ఆర్ఎక్స్ 100’..!
టాలీవుడ్లో ‘ఆర్ఎక్స్ 100’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు ఆజయ్ భూపతిల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ మూవీపై.. అన్ని ఇండస్ట్రీల కన్ను పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో ప్రముఖ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తూ.. ఆర్ఎక్స్ 100ను అక్కడ రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసమే యూనిట్ లొకేషన్ల వేటలో పడింది. ముస్సోరిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేయాలని యూనిట్ భావిస్తోందట. ఇక్కడ సంచనాలు నమోదు చేసిన ఈ మూవీ.. అక్కడ ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో వేచి చూడాలి. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిలాన్ లుత్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. -
బోల్డ్ ఎంట్రీ
బోల్డ్ అండ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు బోల్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించిన మిలన్ లూథ్రియా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నడియాడ్వాలా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ‘‘ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ సినిమాని రీమేక్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా ద్వారా యంగ్ హీరో అహన్ శెట్టి పరిచయం అవుతున్నాడు, సాజిద్లాంటి నిర్మాత ఉన్నారు. ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండబోతోందని అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు మిలన్. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో స్టార్ వారసుడు
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోను కూడా ఫైనల్ చేశారు. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి, ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. IT'S OFFICIAL... Sajid Nadiadwala ropes in director Milan Luthria for Ahan Shetty’s debut... An official remake of #Telugu hit #RX100. pic.twitter.com/AliZIgcFCS — taran adarsh (@taran_adarsh) 15 November 2018 -
రీమేక్‌తో ఎంట్రీ
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. -
సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు
బాలీవుడ్ న్యూ జనరేషన్‌కి సల్మాన్ ఖాన్ లాంచ్ ప్యాడ్లా మారుతున్నాడు. స్టార్ హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేయడానికి సల్మాన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వారసులని పరిచయం చేసిన కండల వీరుడు త్వరలోనే మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. 2010లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాదించిన ఈ బ్యూటీ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దీంతో సల్మాన్ ది గోల్డెన్ హ్యాండ్ అని ఫిక్స్ అయ్యారు అంతా. ఇటీవల 'హీరో' సినిమాతో ఆదిత్య పంచౌలి కొడుకు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలను వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఈ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా, మంచి వసూళ్లను రాబట్టి ఈ ఇద్దరు వారసులను కమర్షియల్‌గా నిలబెట్టింది. తాజాగా మరో వారసుడిని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న అహాన్ త్వరలోనే సల్మాన్ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.