Tadap Movie OTT Release Date, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Tadap Movie: తడప్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Fri, Jan 21 2022 3:48 PM | Last Updated on Fri, Jan 21 2022 4:14 PM

Tadap Movie OTT Release Date, Check Streaming Platform - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100.. టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగారసిందీ చిత్రం. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో తడప్‌గా రీమేక్‌ అయిన విషయం తెలిసిందే! స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి, తారా సుతారియా జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 3న థియేటర్లలో రిలీజైంది.

మిలన్‌ లుథిరా దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతంతమాత్రమే ఆడింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది. హాట్‌స్టార్‌లో జనవరి 28 నుంచి అందుబాటులోకి రానుంది. థియేటర్‌లో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు, హిందీలో దీన్ని ఎలా రీమేక్‌ చేశారో తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నవాళ్లు వచ్చే వారం హాట్‌స్టార్‌లో దీన్ని చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement