లొకేషన్ల వేటలో ‘ఆర్‌ఎక్స్‌ 100’..! | RX 100 Bollywood Remake Pre Productions Work On Full Swing | Sakshi
Sakshi News home page

లొకేషన్ల వేటలో ‘ఆర్‌ఎక్స్‌ 100’..!

Published Sat, Feb 16 2019 12:59 PM | Last Updated on Sat, Feb 16 2019 12:59 PM

RX 100 Bollywood Remake Pre Productions Work On Full Swing - Sakshi

టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర హీరో కార్తీకేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, దర్శకుడు ఆజయ్‌ భూపతిల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇక అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ మూవీపై.. అన్ని ఇండస్ట్రీల కన్ను పడిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రముఖ హీరో సునీల్‌ శెట్టి తనయుడు అహన్‌ శెట్టిని హీరోగా పరిచయం చేస్తూ.. ఆర్‌ఎక్స్‌ 100ను అక్కడ రీమేక్‌ చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసమే యూనిట్‌ లొకేషన్ల వేటలో పడింది. ముస్సోరిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్‌ చేయాలని యూనిట్‌ భావిస్తోందట. ఇక్కడ సంచనాలు నమోదు చేసిన ఈ మూవీ.. అక్కడ ఎలాంటి ట్రెండ్‌ సెట్‌ చేస్తుందో వేచి చూడాలి. సాజిద్‌ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిలాన్‌ లుత్రియా దర్శకత్వం వహిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement