అహన్ శెట్టి
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్‌కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్‌వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్‌లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment