‘ఆర్‌ఎక్స్‌ 100’ రీమేక్‌లో స్టార్ వారసుడు | Suniel Shetty son Ahan to Make Acting Debut With RX 100 Remake | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 15 2018 2:16 PM | Last Updated on Thu, Nov 15 2018 2:20 PM

Suniel Shetty son Ahan to Make Acting Debut With RX 100 Remake - Sakshi

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్‌ స్టోరి ఆర్‌ఎక్స్‌ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్‌ హక్కుల కోసం మంచి డిమాండ్‌ ఏర్పడింది.

ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్‌ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్‌ నదియావాల సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోను కూడా ఫైనల్‌ చేశారు. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్‌ శెట్టి వారసుడు అహన్‌ శెట్టి, ‘ఆర్‌ఎక్స్‌ 100’ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. మిలన్‌ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement