బోల్డ్ లవ్‌ స్టోరిలో టీవీ స్టార్‌ | Tara Sutaria And Ahan Shetty In RX 100 Remake | Sakshi
Sakshi News home page

బోల్డ్ లవ్‌ స్టోరిలో టీవీ స్టార్‌

Published Tue, Mar 26 2019 12:16 PM | Last Updated on Tue, Mar 26 2019 12:16 PM

Tara Sutaria And Ahan Shetty In RX 100 Remake - Sakshi

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్‌ స్టోరి ఆర్‌ఎక్స్‌ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్‌ హక్కుల కోసం మంచి డిమాండ్‌ ఏర్పడింది.

ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్‌ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్‌ నదియావాల సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌తో బాలీవుడ్ హీరో సునీల్‌ శెట్టి వారసుడు అహన్‌ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక కీలకమైన హీరోయిన్‌ పాత్రకు బుల్లితెర నటిని ఫైనల్‌ చేశారు. బెస్ట్ ఆఫ్ లక్‌ నిక్కీ, ఓయ్‌ జెస్సీ సీరియల్స్‌తో ఆకట్టుకొని స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న తారా సుతరియాను ఫైనల్ చేశారు.

ఇప్పటికే అహన్‌, తారాలు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. మిలన్‌ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement