Suniel Shetty Reveals His Love Story with Mana Shetty - Sakshi
Sakshi News home page

Suniel Shetty: గూండాగా తిరిగే టైమ్‌లో లవ్‌.. ఎంతో ప్రేమించా.. జీవితాలతో ఆడుకోవద్దని పేరెంట్స్‌కు..

Published Sun, Apr 23 2023 5:07 PM | Last Updated on Sun, Apr 23 2023 6:01 PM

Suniel Shetty Reveals His Love Story with Mana - Sakshi

ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి పుట్టింది సౌత్‌లో అయినా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రమే నార్త్‌లోనే. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆయన హిందీలో ఎక్కువ చిత్రాలు చేశాడు. 90స్‌లో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత మల్టీస్టారర్‌ చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపాడు. విలన్‌గానే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన అతడు 1991లో వ్యాపారవేత్త, డిజైనర్‌ మన శెట్టిని పెళ్లాడాడు. వీరికి అతియా శెట్టి, అహాన్‌ శెట్టి అని ఇద్దరు పిల్లలు సంతానం.

అయితే వీరి పెళ్లి అంత ఈజీగా జరగలేదట! తాజాగా ఓ షోకి హాజరైన సునీల్‌ శెట్టి తన ప్రేమ, పెళ్లి సంగతులను పంచుకున్నాడు. 'తొలిచూపుకే మనతో ప్రేమలో పడిపోయా. కానీ ఆ సమయానికి నేను గూండాగానే అందరికీ తెలుసు. నా బాడీ, గడ్డం, బైక్‌పై తిరగడం చూసి అందరూ రౌడీ అనే భావించేవారు. అదృష్టం కొద్దీ తను అలా ఫీలవలేదు. క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వచ్చిందంటే చాలు ఆరోజు ఉదయం నాలుగు గంటలకే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యేవాడిని. అయినా ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. తన కళ్లలోకి చూస్తే ప్రేమ, కేరింగ్‌ కనిపించేది. కానీ నా పేరెంట్స్‌ మా ప్రేమను ఒప్పుకోలేదు.

అలా ఒకటీ, రెండు, మూడు.. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నన్ను మొదటిరోజు నుంచే ఇష్టపడ్డారు. మా ప్రేమను అంగీకరించారు. కొన్నిసార్లయితే మేమంతా దెబ్బలాడుకునేవాళ్లం కూడా! నన్ను వేరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటే అది అన్యాయం అవుతుందని, ఆ బంధం నిలబడదని ఇంట్లో హెచ్చరించాను. పెళ్లంటూ చేసుకుంటూ మనను మాత్రమే చేసుకుంటానని తెగేసి చెప్పాను. అనవసరంగా మా జీవితాలతో ఆడుకోవద్దన్నాను. మా పేరెంట్స్‌కు కోడలిని కాకుండా కూతురిలాంటి అమ్మాయిని తేవాలనుకున్నాను. ఆ విషయంలో నేను విజయం సాధించాను' అని చెప్పుకొచ్చాడు సునీల్‌ శెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement