Mana Shetty
-
తొమ్మిదేళ్ల ప్రేమ.. నా పేరెంట్స్ కుదరదన్నారు: సునీల్ శెట్టి
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి పుట్టింది సౌత్‌లో అయినా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రమే నార్త్‌లోనే. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆయన హిందీలో ఎక్కువ చిత్రాలు చేశాడు. 90స్లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపాడు. విలన్‌గానే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన అతడు 1991లో వ్యాపారవేత్త, డిజైనర్ మన శెట్టిని పెళ్లాడాడు. వీరికి అతియా శెట్టి, అహాన్ శెట్టి అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే వీరి పెళ్లి అంత ఈజీగా జరగలేదట! తాజాగా ఓ షోకి హాజరైన సునీల్ శెట్టి తన ప్రేమ, పెళ్లి సంగతులను పంచుకున్నాడు. 'తొలిచూపుకే మనతో ప్రేమలో పడిపోయా. కానీ ఆ సమయానికి నేను గూండాగానే అందరికీ తెలుసు. నా బాడీ, గడ్డం, బైక్‌పై తిరగడం చూసి అందరూ రౌడీ అనే భావించేవారు. అదృష్టం కొద్దీ తను అలా ఫీలవలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఆరోజు ఉదయం నాలుగు గంటలకే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యేవాడిని. అయినా ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. తన కళ్లలోకి చూస్తే ప్రేమ, కేరింగ్ కనిపించేది. కానీ నా పేరెంట్స్ మా ప్రేమను ఒప్పుకోలేదు. అలా ఒకటీ, రెండు, మూడు.. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నన్ను మొదటిరోజు నుంచే ఇష్టపడ్డారు. మా ప్రేమను అంగీకరించారు. కొన్నిసార్లయితే మేమంతా దెబ్బలాడుకునేవాళ్లం కూడా! నన్ను వేరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటే అది అన్యాయం అవుతుందని, ఆ బంధం నిలబడదని ఇంట్లో హెచ్చరించాను. పెళ్లంటూ చేసుకుంటూ మనను మాత్రమే చేసుకుంటానని తెగేసి చెప్పాను. అనవసరంగా మా జీవితాలతో ఆడుకోవద్దన్నాను. మా పేరెంట్స్‌కు కోడలిని కాకుండా కూతురిలాంటి అమ్మాయిని తేవాలనుకున్నాను. ఆ విషయంలో నేను విజయం సాధించాను' అని చెప్పుకొచ్చాడు సునీల్ శెట్టి. -
నా భర్తే నా ఫేవరెట్
టైం దొరికితే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చూస్తానంటున్న మనాశెట్టి.. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే మాత్రం భర్త సునీల్‌శెట్టి పేరు ఠక్కున చెప్పేసింది. సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేసిన సునీల్‌శెట్టి.. రియల్ లైఫ్‌లో ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో బుధవారం జరిగిన అరాయిశ్ ఎగ్జిబిషన్లో ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ను ఏర్పాటు చేసిన మనాశెట్టితో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. అరాయిష్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద పిల్లల చదువు కోసమే వెచ్చిస్తామన్నారు మనాశెట్టి. ‘హైదరాబాద్‌కు రావడం ఇది ఫోర్త్ టైం. ఈసారి స్టాల్‌లోని డిజైనింగ్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాదీలకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ’ని కొనియాడింది. ‘మా అమ్మ 25 ఏళ్ల క్రితం స్థాపించిన ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా’కు విరాళాల కోసమే ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశాన’ని తెలిపింది. టేస్ట్ అదుర్స్.. ‘నగరానికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి వంటకాల రుచులు చూడందే వెళ్లం. ఇక్కడి స్పైసీ ఫుడ్ టేస్ట్ అదుర్స్. చారిత్రక కట్టడాలను కూడా సందర్శిస్తాన’ని వివరించింది మనా. తన కుమార్తె అతియా శెట్టి హిందీ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పింది. కెరీర్ పరంగా అతియాకు సునీల్ కూడా మంచి గెడైన్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. రెస్పాన్స్ సూపర్బ్ ‘అరాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి బాగుంది. గతేడాదితో పొల్చుకుంటే ఈసారి డిఫరెంట్ డిజైనర్లు రూపొందించిన లేడీస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి.ఎగ్జిబిషన్‌కు స్థానిక మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. వందలాది మంది రావడం చూస్తుంటే సిటీ లేడీస్ డ్రెస్సింగ్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంతో కనబడుతోంది. సో థ్యాంక్స్ టూ హైదరాబాదీస్’ అంటూచిట్చాట్ ముగించింది.