బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..! | Dulquer Salmaan to make Bollywood debut | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..!

Published Sat, Aug 12 2017 12:38 PM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..!

బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..!

ఓకె బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్, తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమాతో నార్త్ లో అడుగుపెడుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఎక్కువ భాగం కేరళలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రావెల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆకర్ష్ ఖురానా దర్శకుడు. ప్రస్తుతం సోలో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న దుల్కర్ త్వరలో బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement