మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. దుల్కర్ నటించిన తొలి తెలుగు సినిమా మాత్రం మహానటే. తొలి సినిమాతోనే నటిగా దుల్కర్ కు మంచి గుర్తింపు రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో గతంలో నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారు.
హేయ్ పిల్లాగాడా, 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాతో టాలీవుడ్‌లో సందడిచేసిన దుల్కర్ త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సోలో సినిమాను తెలుగులో ‘అతడే’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ నాలుగు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకుడు. ఇటీవల ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment