
మైథిలా పాల్కర్, దుల్కర్, ఇర్ఫాన్ ఖాన్
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటించిన ‘ఒకే కన్మణి’ చిత్రం తెలుగులో ‘ఓకే బంగారం’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో ‘కర్వాణ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, మైథిలా పాల్కర్ ముఖ్య తారలుగా నటించారు.
ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు డిఫరెంట్ వ్యక్తుల లైఫ్ జర్నీతో ఈ సినిమా సాగనుందని బీటౌన్ టాక్. రెండు డెడ్‌బాడీస్ చుట్టూ ఈ ముగ్గురి కథ తిరుగుతుందట. అది ఎలా అనేది ఆగస్టులో వెండితెరపై చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment