రామ్‌ చరణ్‌ మల్టీ స్టారర్‌.. ఫేక్‌ న్యూస్‌ | Dulquer Salmaan And Ram charan Are Not Uniting For A Tollywood Movie | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 1:43 PM | Last Updated on Thu, May 17 2018 1:47 PM

Dulquer Salmaan And Ram charan Are Not Uniting For A Tollywood Movie - Sakshi

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీదకు రాకముందే మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రామ్‌ చరణ్‌ అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాలో జెమినీ గణేషన్‌ పాత్రలో ఆకట్టుకున్న దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కే చక్రవర్తి కథ అందిస్తుండగా కే యస్‌ రవిచంద్ర దర్శకత్వం వహిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దుల్కర్‌ సల్మాన్‌ సన్నిహితులు స్పందించారు. దుల్కర్‌ ఏ మల్టీ స్టారర్‌ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ కర్వాన్‌ పనుల్లో బిజీగా ఉన్న దుల్కర్‌, తరువాత ఇప్పటికే అంగీకరించిన మలయాళ చిత్రాలు పూర్తి చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement