Fans Disappointed Over Dulquer Salmaan And Ram Charan Ads - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan-Ram Charan: ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు బ్రో!

Published Wed, Jul 5 2023 3:56 PM | Last Updated on Wed, Jul 5 2023 5:00 PM

Dulquer Salmaan Phone Ad Ram Charan Meesho Ad - Sakshi

స్టార్ హీరోలు.. తమ అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు! దారుణంగా మోసం చేస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య కాలంలో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. తాాజాగా స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. తమని తామే తిట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?

వీడియో దానికోసమా? 
మిగతా హీరోల సంగతేమో గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసి, డిలీట్ చేసేశాడు. తనకు సరిగా నిద్రపట్టడం లేదని ఆ వీడియోలో బాధపడ్డాడు. కట్ చేస్తే.. ఇదంతా కూడా ఓ ఫోన్ బ్రాండ్ ప‍్రమోషన్ కోసమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. 

(ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

రామ్‌చరణ్ కూడా
పైన దాంట్లో దుల్కర్ వీడియో పెట్టి కావాలని డిలీట్ చేసి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అలా ఏం చేయలేదు. కాకపోతే రెండు రోజుల ముందు ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో రామ్ చరణ్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కనిపించారు. ఇదేదో వెబ్ సిరీస్ లేదా సినిమా కోసమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇదీ ఓ బట్టలు విక్రయించే ఓ యాప్ కోసం ప్రమోషన్ అని తేలిపోయింది.

ఇలా పైన చెప్పిన రెండు సందర్భాలే కాదు.. ఈ మధ్య పలువురు హీరోహీరోయిన్లు ఇలానే ఏదో ఓ వీడియో రిలీజ్ చేయడం, అభిమానుల‍్లో హైప్ వచ్చేలా చేయడం, తీరా చూస్తే అది ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం అని తెలిసి మోసపోవడం. ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సొంత హీరోహీరోయిన్లనీ ఏం అనలేక అభిమానులు తమని తామే తిట్టుకుంటున్నారు. కాబట్టి స్టార్స్ ఏదైనా వీడియో, పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్‌ ఫిర్యాదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement