... నా మాట నేనే వినను అని ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ని అంత ఈజీగా మరచిపోలేం. రకుల్ ప్రీత్‌సింగ్ మాటలు వింటుంటే.. ఈ డైలాగ్‌ని కొంచెం రివర్శ్ చేయొచ్చేమో. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను కచ్చితంగా వింటా’ అన్నట్లుగా ఆమె చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంతకీ రకుల్ ఏమన్నారంటే?... ‘నాన్నకు ప్రేమతో’లో ఈ బ్యూటీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా. ఆ తర్వాత సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ సినిమాలు చేశారు.
కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఇక నుంచి తెలుగులో తాను చేసే క్యారెక్టర్లకు సొంత గొంతు వినిపించాలనే డెసిషన్ ఒకటి. ‘‘నేను తెలుగు బాగా మాట్లాడతా. ఎంత బాగా అంటే నా మాతృభాష పంజాబీకన్నా బాగా మాట్లాడుతున్నా. అందుకే ‘నాన్నకు ప్రేమతో’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఈ 2018లో చేసే సినిమాలన్నింటికీ అలానే చేయాలని కమిట్ అయ్యా’’ అన్నారు రకుల్. మంచిది. మంచి నిర్ణయమే. ఎంత బాగా యాక్ట్ చేసినా సొంత గొంతు వినిపిస్తే ఆ తృప్తే వేరు. ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అని కూడా అనిపించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment