nannaku prenmatho
-
ఒక్కసారి కమిట్ అయితే...
... నా మాట నేనే వినను అని ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ని అంత ఈజీగా మరచిపోలేం. రకుల్ ప్రీత్‌సింగ్ మాటలు వింటుంటే.. ఈ డైలాగ్‌ని కొంచెం రివర్శ్ చేయొచ్చేమో. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను కచ్చితంగా వింటా’ అన్నట్లుగా ఆమె చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంతకీ రకుల్ ఏమన్నారంటే?... ‘నాన్నకు ప్రేమతో’లో ఈ బ్యూటీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా. ఆ తర్వాత సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ సినిమాలు చేశారు. కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఇక నుంచి తెలుగులో తాను చేసే క్యారెక్టర్లకు సొంత గొంతు వినిపించాలనే డెసిషన్ ఒకటి. ‘‘నేను తెలుగు బాగా మాట్లాడతా. ఎంత బాగా అంటే నా మాతృభాష పంజాబీకన్నా బాగా మాట్లాడుతున్నా. అందుకే ‘నాన్నకు ప్రేమతో’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఈ 2018లో చేసే సినిమాలన్నింటికీ అలానే చేయాలని కమిట్ అయ్యా’’ అన్నారు రకుల్. మంచిది. మంచి నిర్ణయమే. ఎంత బాగా యాక్ట్ చేసినా సొంత గొంతు వినిపిస్తే ఆ తృప్తే వేరు. ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అని కూడా అనిపించుకోవచ్చు. -
తప్పులుంటే క్షమించండి : రకుల్
ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. తను డబ్బింగ్ చెపుతుండగా తీసిన ఓ మేకింగ్ వీడియోను తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. మరో అడుగు ముందుకేసి ఈ తొలి ప్రయత్నంలో ఏమైన తప్పులు జరిగినా.. క్షమించండీ అంటూ అందరి మనసు గెలుచుకుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. Who says dubbing is easy!! but me loving it!! #dubbing #NaannakuPrematho #workislife pic.twitter.com/fYNUwPRREk — Rakul Preet (@Rakulpreet) January 3, 2016