తప్పులుంటే క్షమించండి : రకుల్ | rakul preeth singh own dubbing for nannaku prematho | Sakshi
Sakshi News home page

తప్పులుంటే క్షమించండి : రకుల్

Published Wed, Jan 6 2016 1:35 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

తప్పులుంటే క్షమించండి : రకుల్ - Sakshi

తప్పులుంటే క్షమించండి : రకుల్

ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.

తను డబ్బింగ్ చెపుతుండగా తీసిన ఓ మేకింగ్ వీడియోను తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. మరో అడుగు ముందుకేసి ఈ తొలి ప్రయత్నంలో ఏమైన తప్పులు జరిగినా.. క్షమించండీ అంటూ అందరి మనసు గెలుచుకుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement